Saturday, 24 February 2018

MUKHYA VISHAYAM TO TAPPING COMMUNITY PEOPLE


ముఖ్య విషయము 


మిత్రులు అందరికి నమస్కారములు. 
శెట్టిబలిజ, గౌడ్, ఈడిగ, శ్రీశైన మరియు యాత (కల్లు గీత) కులాల ప్రజల అభివృద్ధి మరియు ఐఖ్యత విషయంలో చర్చించాలని నేను ఈ బ్లాగ్ ను చాల కాలం  క్రితం  ఏర్పాటు చేశాను.

నా పేరు గుబ్బల సత్య ప్రసాద్,  వయస్సు 62 సంవత్సరములు. ముంబైలో స్థిరపడ్డాను. ఈ కులములో పుట్టాను కాబట్టి  ఈ కులము కోసం కొంత సేవ చేయాలనీ అనుకొంటూ 1985 లో ముంబై లో స్థాపించబడిన "బొంబాయి ఆంధ్ర శెట్టిబలిజ సమాజం " లో సాధారణ  సభ్యుడిగా చేరాను. అప్పటినుండి ఇప్పటి వరకు  33 సంవత్సరములు వివిధ సేవలు చేస్తూ, ఇప్పుడు బొంబాయి ఆంధ్ర శెట్టిబలిజ సమాజం యొక్క సలహా కమిటీ మెంబెర్ గా  పని చేస్తున్నాను. 

33 సంవత్సరముల నుండి మన ఐఖ్యత అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. బొంబాయిలో ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఐదు కులాల ఐఖ్యత ఎలా సాదించాలి అనేదే ప్రశ్న. అందుకోసం నేను ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని నాకు తెలిసిన కొంత మంది పెద్దలను అడిగాను. ఒక్కొక్కరు ఒక్కో విధముగా చెప్పారు. అందరు నొక్కి చెప్పిన మాట ఏమిటంటే రెండు రాష్ట్రాలలోని సామాన్య ప్రజలను, విద్యావంతులను, రాజకీయ నాయకులను, సామజిక సేవకులను , మహిళలను, యువతి యువకులను ఒక్క చోట పిలచి చర్చించి నిర్ణయం తీసుకొంటే బాగుంటుందని అన్నారు. మరి ఇంత మందిని కాంటాక్ట్ చేయడం ఎలా ? అందుకోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ను పెట్టాను. అందులో చాల మంది జాయిన్ అయ్యారు. వారి వారి సలహాలు ఇస్తున్నారు. గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే 9819993349 కి మీ పూర్తి పేరు, వూరు, మీ వయస్సు, మీ వృత్తి తెలియ చేయండి, మీరు  శెట్టిబలిజ, గౌడ్, ఈడిగ, శ్రీశైన మరియు యాత  కులస్తులై ఉండాలి. ఈ బ్లాగ్ మరియు నా వాట్సాప్ గ్రూప్ ద్వారా చర్చించుకొని మన జాతి ఐఖ్యత  మరియు అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం. మీ మీ అభిప్రాయాలను కూడా పోస్ట్ చేయండి. మీకు తెలిసిన మన కులస్తులకు తెలియజేసి వారిని కూడా సేవలో పాలు పంచుకోమని చెప్పండి. ఇది నిస్వార్ధ  సేవ మాత్రమే. స్వలాభం కోసం గాని, స్వప్రయోజనాలు కోసం గాని కాదు అని గ్రహించాలి.

ఇదే విషయం గురుంచి ఈ బ్లాగ్లో చాల పోస్ట్లు ఉన్నాయి. చదవండి స్పందించండి.

ఇట్లు
మీ
గుబ్బల సత్య ప్రసాద్
ముంబై
9819993349

24. 02. 2018

No comments:

Post a Comment