Sunday, 1 September 2019

"SETTIBALIJA" KU NOORENDLU. 25.09.1920 TO 25.09.2020


"శెట్టిబలిజ" కు నూరేండ్లు 

శెట్టిబలిజ సంఘీయులు అందరికి వందనములు. 

చరిత్ర ద్వారా తెలిసిన కొన్ని విషయాలు  వల్ల ప్రేరేపితుడనై ఈ మెసేజి వ్రాస్తున్నాను. 
మిలో చాలామందికి తెలిసినవే. 

అది 1920 సంవత్సరం తరతరాలుగా పరపీడనములో మ్రగ్గిపోయి అభివృద్ధికి నోచుకోని శెట్టిబలిజ జాతిని ఉద్దరించడానికి బద్దకంకణులు అయ్యారు కి. శే. శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు. 

నాడు బర్మా దేశేములో వ్యాపారం చేసి ధనం సంపాదించారు. కానీ తమ జాతి సోదరులు నిరక్షరాస్యులుగ అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడుతున్నారు. వారికీ చేయూత అందించి, వారిని ఒక గౌరవమైన జాతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 25.. 9. 1920 రోజున బోడసకుర్రు గ్రామములో ఒక మహా జన సభ ఏర్పాటు చేసారు. అదే మన "శెట్టిబలిజ" ఐక్యతకు నాంది. 

ఆ సభలో చేసిన కొన్ని ముఖ్య తీర్మానాలు;-

1.  తరతరాలుగా వివిధ పేర్లతో పిలువబడే ఈ జాతి  ఇకపై "శెట్టిబలిజ" అని పిలవబడాలి. 

2.  గవర్నమెంట్ లెక్కలలోగాని, దస్తావేజులలోగాని, ఏ రెకార్డులలోగాని "శెట్టిబలిజ" అని వ్రాయించుకోవాలని తీర్మానించారు. 

3.  ఇకపై  ఈ కులస్తులను "గాడు" అని వ్యవహరించరాదు. అలా అమరియాదా కరంగా రికార్డుల్లో వ్రాయకుండా శాసించ వలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమొరాండం సమర్పించాలని తీర్మానించారు. ఈ మెమొరాండం అందిన తారువాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా డివిషనల్ తాలూకా ఉద్యోగులు అందరికి  "శెట్టిబలిజ" కులస్తుల పేర్ల చివర "గాడు" అని వ్రాయకూడదు అని ఆర్డర్ పంపించారు. 

4.  ఈ జాతిలో ఉన్నత విద్యావంతులు గాని, ఉన్నత ఉద్యోగులుగాని ఒక్కరు కూడా లేనందున ఈ జాతి బాల బాలికలకు ఉచిత విద్య సౌకర్యం కలిగించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. 

ఇంకా ఎన్నో తీర్మానాలు చేసారు. 

ఈ విధముగా జాతి ఉన్నతి కోసం మన పెద్దలు కృషి చేసారు. 1920 లో "శెట్టిబలిజ సంఘం" స్థాపించి రిజిస్టర్ చేయించారు. 

ఈ విధముగా మన "శెట్టిబలిజ" నామకరణం 25. 09. 1920 లో జరిగింది. త్వరలో వంద సంవత్సారములు పూర్తి కాబోతున్నాయి. 

25. 09. 1920 నుండి 25. 09. 2020  కి  100 సంవత్సరములు పూర్తి అవుతున్న సందర్బములో మనం అందరం శెట్టిబలిజ నూరేండ్ల పండుగ జరుపుకుందాం.  జాతికి సేవ చేసిన మన పెద్దలను స్మరించుకుందాం. 

జై శెట్టిబలిజ.  జై జై శెట్టిబలిజ . 

ధన్యవాదములు 

ఇట్లు 
గుబ్బల సత్య ప్రసాద్ 
గౌరవ అధ్యక్షులు,
బొంబాయి ఆంధ్ర శెట్టిబలిజ సమాజం (రి. జి.)
ముంబై 
9819993349
బ్లాగ్: gubbalasprasad.blogspot.com 

రిక్వెస్ట్;
మన జాతి శెట్టిబలిజ గురించిగాని, మన పెద్దల గురించి గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ బ్లాగ్లో పోస్ట్ చేసి అందరికి తెలిసేలాగా షేర్ చేయండి. 

3 comments:

  1. Hats of to you sir,🙏

    ReplyDelete
  2. Guruvu garu madhi surname "Mulugurthi".tulya mahamuni gothram. Ma kula devatha evaro koncham chepagalara please. Atleast memu east godavari nundi west godavari migrate ayam ani chepthunaru. Migrate avaka mundhu ma village ento chepagalara 🙏🙏🙏🙏

    ReplyDelete