Friday, 31 December 2010

GREAT PEOPLE

సెట్టిబలిజ జాతి రత్నము 

కీర్తి శేషులు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు , బోడసకుర్రు స్వగ్రామం. సెట్టిబలిజ సంఘ స్థాపనకు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు మూల పురుషులు. సంఘ అభ్యుదయానికి తమ ధనమును, కాలమును, పలుకుబడిని ఉపయోగించి పాటుపడిన ధీశాలి. గుర్రపు స్వారీ యందు మిక్కిలి అభిరుచి, అనుభవము  కలవారు .  సంఘ అభ్యుదయానికి అవసరమగు ప్రచారమును అమలుపరచుటకై సుముహూర్తమును నిర్ణయించి తమ స్వగ్రామమగు బోడసకుర్రులో 26.09.1920 తేదీన మహాసభను సమావేశ పరచినారు. వ్యయ ప్రయసలనక పలు ప్రాంతములునుంది పదివేల  మందికి పైగా సంఘీకులు విచేసిరి. వారి కెల్లా భోజనాది సౌకర్యములు కల్పించితిరి.
సంఘ విద్యానిధికి పది వేల రూపాయలు నొసగిన  త్యాగమూర్తి. పెరూరులోని డి,ఎన్.శెట్టి, డి.వి. రెడ్డి హై స్కూల్ కోసం ఎంతో సొమ్మును ఇచ్చిరి. వీరి ధన సహాయముచేత ఎందరో వున్నతి విద్యలనంది ఉన్నత పదవులను పొంది ఉన్నారు. ఈయన గొప్ప భక్తుడు. సంఘోద్దరణకు ఉదయించిన మహా మూర్తి .అన్ని వర్గాములవారికి అన్న వస్త్ర దానములు చేసిన దానకర్ణుడు. మనకుల దైవము, నిత్యమూ ఆరాదించవలసిన మూల పురుషుడు.

Saturday, 18 December 2010

1940 "PUROHITA SAMITI"

చరిత్ర ఆదారాలు బట్టి పెండ్లిళ్ళు , పూజలు చేయించటానికి మన కులం లోని కొందరు పురోహితులుగా  తయారు అయ్యారు అని తెలుస్తుంది. ఇలా పురోహితులుగా ఎందుకు అవ్వవలసి వచ్చినదో  చూద్దాము.
పాత రోజుల్లో ఒక నాడు శ్రీ దొమ్మేటి వారి ఇంట్లో  పెండ్లి జరిగిందట. కట్నాల సమయంలో బ్రాహ్మణ పురోహితుడు ఇలా అన్నాడట  "దొమ్మేటి వెంకట రెడ్డి " పెండ్లి కుమారున్ని  ఆశీర్వదించి నూటపదహార్లు అని. అక్కడ ఉన్న వారు కోప పడి "దొమ్మేటి వెంకట రెడ్డి" కాదు  "దొమ్మేటి వెంకట రెడ్డి గారు " అని చదవమన్నారట. ఆ  పురోహితుడు అలా నేను చదవను అన్నాడట.  గారు అని  అనను అన్నాడట. వెంటనే అ పురోహితున్ని  పంపించివేసి నారు అట. ఇటువంటి అన్నో సంఘటనలు జరిగిన కారణంగా  మన కులస్తులు పురోహితులు గా మారారు అని తెలుస్తుంది.

1940 స.లో పురోహిత సమితి స్తాపించబడింది. అప్పటినుండి ఇప్పటివరకు మన కులములో చాల మంది పురోహితులుగా మారి మనకు సేవలు అందిస్తున్నారు. వారి అందరికి సుభాభివందనములు.

16.09.1940 తారీకున రాజోలు తాలూకా, తాటిపాక మటం గ్రామంలో సెట్టిబలిజ పురోహిత ద్వితీయ మహాసభ జరిగింది. ఆ సభకు ముప్పై మంది సెట్టిబలిజ పురోహుతులు వచ్చారు. కార్య నిర్వాహక వర్గం ఎన్నికయ్యంది .

Monday, 13 December 2010

1920 - SETTIBALIJA SANGAM

అందుబాటులో ఉన్న ఆదారాలు ప్రకారం కీర్తిశేషులు దొమ్మేటి వెంకట రెడ్డి  గారు మరియు కొంతమంది సంఘీయులు కలసి  తూర్పు, పచ్చిమ గోదావరి, కృష్ణ, విశాఖ జిల్లాల సెట్టిబలిజ సంఘం ను బోడస్కురులో  స్థాపించిరి. ఈ సంఘం కార్య  స్థానం  అమలాపురం,తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ గా నిర్ణయించిరి. ఈ సంఘంను రిజిస్టర్ చేయించి రిజిస్టర్ నెంబర్ 1/1927 గా పొందినట్లు  తెలుస్తుంది.
AS PER THE AVAILABLE INFORMATION,  RESPECTED (LATE) SHRI DOMMETI VENKATA REDDY GARU ALONG WITH SOME OTHER COMMUNITY PEOPLE ESTABLISHED " THE EAST-WEST GODAVARI, KRISHNA, VISHAKHA DISTRICTS' SETTIBALIJA SANGHAM"., IN THE VILLAGE BODASKURU, IN THE YEAR 1920.THEY REGISTERED THIS SANGHAM UNDER REGISTRATION NUMBER 1/1927. THEY DECIDED TO WORK FROM AMALAPURAM, AS THEIR WORKPLACE.

KEEPING IN MIND THE YOUNG GENERATION ANDHRAITES STAYING OUTSIDE A.P, I AM PUBLISHING THIS INFORMATION IN BOTH TELUGU & ENGLISH.

Wednesday, 8 December 2010

Welcome To My Blog

గౌడ, శేట్టిబలిజ,  శ్రీశయన, ఈడిగ, యాత కులస్తులందరికి,
బొంబాయి నుండి గుబ్బల సత్య ప్రసాద్ నమస్కారములతో వ్రాయునది,
మన జాతి గురించి నాకు తెలిసిన విషయాలు  మన జాతీయుల అందరితో నా బ్లాగ్ ద్వార  పంచుకోవాలని అనుకొంటున్నాను.
పైన తెలియజేసిన గౌడ, శేట్టిబలిజ,  శ్రీశయన, ఈడిగ, యాత కులస్తులు అందరు మీ మీ  అభిప్రాయాలను, క్రొత్త, పాత విషయాలను నా బ్లాగ్ ద్వారా మన జతీయులుతో పంచుకొంటారని ఆశిస్తున్నాను.