Friday, 31 December 2010

GREAT PEOPLE

సెట్టిబలిజ జాతి రత్నము 

కీర్తి శేషులు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు , బోడసకుర్రు స్వగ్రామం. సెట్టిబలిజ సంఘ స్థాపనకు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు మూల పురుషులు. సంఘ అభ్యుదయానికి తమ ధనమును, కాలమును, పలుకుబడిని ఉపయోగించి పాటుపడిన ధీశాలి. గుర్రపు స్వారీ యందు మిక్కిలి అభిరుచి, అనుభవము  కలవారు .  సంఘ అభ్యుదయానికి అవసరమగు ప్రచారమును అమలుపరచుటకై సుముహూర్తమును నిర్ణయించి తమ స్వగ్రామమగు బోడసకుర్రులో 26.09.1920 తేదీన మహాసభను సమావేశ పరచినారు. వ్యయ ప్రయసలనక పలు ప్రాంతములునుంది పదివేల  మందికి పైగా సంఘీకులు విచేసిరి. వారి కెల్లా భోజనాది సౌకర్యములు కల్పించితిరి.
సంఘ విద్యానిధికి పది వేల రూపాయలు నొసగిన  త్యాగమూర్తి. పెరూరులోని డి,ఎన్.శెట్టి, డి.వి. రెడ్డి హై స్కూల్ కోసం ఎంతో సొమ్మును ఇచ్చిరి. వీరి ధన సహాయముచేత ఎందరో వున్నతి విద్యలనంది ఉన్నత పదవులను పొంది ఉన్నారు. ఈయన గొప్ప భక్తుడు. సంఘోద్దరణకు ఉదయించిన మహా మూర్తి .అన్ని వర్గాములవారికి అన్న వస్త్ర దానములు చేసిన దానకర్ణుడు. మనకుల దైవము, నిత్యమూ ఆరాదించవలసిన మూల పురుషుడు.

No comments:

Post a Comment