చరిత్ర ఆదారాలు బట్టి పెండ్లిళ్ళు , పూజలు చేయించటానికి మన కులం లోని కొందరు పురోహితులుగా తయారు అయ్యారు అని తెలుస్తుంది. ఇలా పురోహితులుగా ఎందుకు అవ్వవలసి వచ్చినదో చూద్దాము.
పాత రోజుల్లో ఒక నాడు శ్రీ దొమ్మేటి వారి ఇంట్లో పెండ్లి జరిగిందట. కట్నాల సమయంలో బ్రాహ్మణ పురోహితుడు ఇలా అన్నాడట "దొమ్మేటి వెంకట రెడ్డి " పెండ్లి కుమారున్ని ఆశీర్వదించి నూటపదహార్లు అని. అక్కడ ఉన్న వారు కోప పడి "దొమ్మేటి వెంకట రెడ్డి" కాదు "దొమ్మేటి వెంకట రెడ్డి గారు " అని చదవమన్నారట. ఆ పురోహితుడు అలా నేను చదవను అన్నాడట. గారు అని అనను అన్నాడట. వెంటనే అ పురోహితున్ని పంపించివేసి నారు అట. ఇటువంటి అన్నో సంఘటనలు జరిగిన కారణంగా మన కులస్తులు పురోహితులు గా మారారు అని తెలుస్తుంది.
1940 స.లో పురోహిత సమితి స్తాపించబడింది. అప్పటినుండి ఇప్పటివరకు మన కులములో చాల మంది పురోహితులుగా మారి మనకు సేవలు అందిస్తున్నారు. వారి అందరికి సుభాభివందనములు.
16.09.1940 తారీకున రాజోలు తాలూకా, తాటిపాక మటం గ్రామంలో సెట్టిబలిజ పురోహిత ద్వితీయ మహాసభ జరిగింది. ఆ సభకు ముప్పై మంది సెట్టిబలిజ పురోహుతులు వచ్చారు. కార్య నిర్వాహక వర్గం ఎన్నికయ్యంది .
No comments:
Post a Comment