Monday 30 September 2013

SETTIBALIJA MAHA JANA SABHA 25.09.1920


FIRST SETTIBALIJA MAHA JANA SABHA AND ITS RESOLUTIONS
(by Kavi Tilaka, Vidwan Sri Gubbala Madhava Murty garu)




కవి తిలక, విద్వాన్  గుబ్బల మాధవముర్తి గారు, జగ్గన్నపేట, రాజోలు తాలూకా, తూర్పు గోదవరి జిల్ల,  వారి మాట :
======================================================================

" ఏ దేశ చరిత్ర చూచినా 
  ఏమున్నది  గర్వకారణం ?
  నరజాతి చరిత్ర సమస్తం 
  పరపీడన పరాయనత్వం "   -శ్రీ శ్రీ 

తరరాలుగా పర పీడన లో మ్రగ్గిపోయి అభివృద్దికి నోచని సెట్టిబలిజ జాతిని ఉద్దరించడానికి బద్దకంకనులయ్యారు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు. 
అది1920 సెప్టెంబర్ 25 తేది.. నేల ఈనినట్లుగా నేల నాలుగు చెరగుల నుండి తండోపతండాలుగా కదలి వస్తున్నారు సెట్టిబలిజ జాతీయులు,
ఉరకలు వేసే ఉత్సాహంతో బోడసకుర్రు గ్రామం చేరుకొంతున్నారు. ఈ బోడసకుర్రు తూర్పుగోదవరి జిల్లాలోని అమలాపురం తాలుకాలో పవిత్ర 
వైనతేయ నదీతీరంలో ఉన్నది. అది జతినంతటినీ ఒక్క త్రాటి ఫై  చేర్చటానికి జరుగుతున్నా బృహత్తర ప్రయత్నం  -మహయజ్ఞం. 

 సెట్టిబలిజ మహాజనసభ తమ సొంత ఖర్చులఫై బోడసకుర్రు గ్రామంలో ఏర్పాటుచేసారు శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి సొదరులు. ఆరోజుల్లో సుమారు 
పదివేలరుపాయలు  వేచ్చించి పదివేలమందికి భోజనాదులు ఏర్పాటుచేసి వైభవోపేతంగా సభను నిర్వహించారు.

ఎందుకు ?

బర్మా దేశములో వ్యాపారాదులు చేసి లక్షలాది ధనం సంపాదించి ఉన్నతవిద్యవంతులయ్యారు శ్రీ దొమ్మేటివారు. కానీ తమ జాతి సోదరులు నిరక్షరాస్యులై అజ్ఞానందకారంలో కొట్టుమిట్టాడుతున్నారు.  అలాంటి అట్టడుగు జతిసోదరులకు చేయూతనందించి వారిని గౌరవమైన జాతిగ 
తీర్చి దిద్దాలని సంకల్పంతో ఈ సభను తమ స్వగ్రామంలో నిర్వహించారు. 

ఈ మహాసభకు సెట్టిబలిజ ప్రముఖులే కాకుండా ఇతర పెద్దలు కూడా వచ్చి సభలో పాల్గొన్నారు. కాకినాడ నుండి శ్రీ ఆచంట సుబ్బరయుడు
నాయుడు గారు, రాజమండ్రి నుండి శ్రీ గోపిసేట్టి నారాయణస్వామి నాయుడు గారు, దివాన్ బహద్దర్  మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు గారు. 
అమలాపురం నుండి శ్రీ నల్లా  రెడ్డి నాయుడు గారు. శ్రీ మంద సుబ్బారావు గారు వగైరా, అల్లవరం వాస్తవ్యులు శ్రీ గుబ్బల రామన్న గారి 
అద్యక్షతలో ఈ మహాసభలు జరిగాయి. 

ముఖ్యమైన తీర్మానాలు;
==============
తరతరాలుగా" ఈడిగ, యీన్ద్ర, యాత" మొదలయిన పేర్లతో పులువబడే  ఈ జాతి ఇకమీద  "సెట్టిబలిజ" అని పిలువబడాలి. గవర్నమెంట్ లెక్కల్లో 
గాని, దస్తవేజుల్లో గాని, ఏ రికార్డుల్లో గాని  "సెట్టిబలిజ" అని వ్రాయిన్చుకోవాలని తీర్మానించారు. 

గ్రామ లెక్కల్లోనూ ఇతరత్రా ఈ కులస్తులను "గాడు" అని వ్యవహరించారాదు. అలా అమర్యదకరరంగా రిగార్డులలో వ్రాయకుండా ససిన్చావలసినడిగా జిల్లా కలెక్టర్ వారికి ఒక మెమొరాండం సమర్పించాలని తీర్మానించారు. 

ఈ మెమొరాండం అందినతారువత జిల్లా కలెక్టర్ వారు జిల్లా, డివిజినల్, తాలూకా ఉద్యోగులు అందరికి సెట్టిబలిజ కులస్థుల పీర్ల చివర  "గాడు" అని 
వ్రాయకూడదని ఆర్డర్ పంపించినారు. ఆర్డర్: 10/07/1920 డీ. యస్. నేం. 2140 రెవిన్యూ. 

ఈ జాతిలో ఉన్నత విద్యవంతులుగాని, ఉన్నతోద్యోగులుగాని వోక్కరు కూడా లేనందువల్ల ఈ జాతి బాలబాలికలకు ఉచిత విద్య సౌకర్యం కలిగిన్చావలసిన్దిగా ప్రభుత్యాన్ని కోరుతూ తీర్మానించారు. 

కేవలం ప్రభుత్య సహాయం పైనే ఆధారపడకుండా జాతీయులలో విద్యనూ అబివృద్ది చేయడానికి విద్య నిధిని సేకరించి పెదవిద్యర్ధులకు ధనసహాయం అందించడానికి, అవసరమైన చోట్ల పతసలలు నిర్మించడానికి తీర్మానించారు. 


This is the history, but it gives us inspiration how we should plan for our future generations. I personally feel- still
there is need to do more for the needy. Tks.

No comments:

Post a Comment