Sunday, 13 October 2013

HISTORY -BY KAVI TILAKA, VIDWAN SRI GUBBALA MADHAVA MURTHY GARU

కవి తిలక, విద్వాన్ శ్రీ గుబ్బల మాధవమూర్తి గారు స్వర్ణోత్సవ సంచిక లో  "ముందుమాట" లో సెట్టిబలిజలు గురుంచి ఇలా  వ్రాసినారు. 

ఎవరీ సెట్టిబలిజలు?  ఏమిటి వీరి కథ?
=======================

మహాభారతం వ్రాసిన వ్యాసుడు ఈడిగ కులానికి చెందిన  వాడని ఒక కథ ప్రచారంలో ఉంది. 

సీ : "వ్యాసు లీడిగ  వాని వేసముం గైకొని 
      అరుదేన్తురట  కాశికి .... "

ఆదిశంకరాచార్యులవారు అన్నివిద్యలు నేర్చి మండమిశ్రుడనే పండితునితో వాదించటానికి వెళ్లారట- లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరకలెదు. బయటనే నిలబడి ఉన్నారట. ఇంతలో ఒక ఈడిగ కులస్థుడు వారున్న చోటికి వచ్చి తన మంత్రం ప్రభావంతో తాటి  చెట్టును క్రిందికి వంచి కల్లు గీస్తున్నాడట. అది చూచి ఆశ్చెర్య పోయిన  శంకరాచార్యులు  " నేను అన్ని విద్యలలోను ఆరితెరానని అనుకొన్నను. కానీ ఇలా చెట్టును వంచ్చే విద్య నాకు తెలియదుకదా" అని అలోచించి ఆ ఈడిగవానికి బంగారం చేసే విద్య నీర్పి తాను  చెట్టును వంచ్చే మంత్రం నేర్చ్చుకోన్నారట. అంటే శంకరాచార్యులంతటి వారికి మంత్రం నేర్పిన జాతి ఇది. 

ఏడు ఘడియల రాజు సర్వాయిపాపడు :
========================

17వ శతాబ్దంలో సర్వాయి పాపన్న అనే మహావీరుడు ఉండేవాడు.  ఇతనిది కల్లుగీసే వృత్తి.  ఇతనిని ఈడిగవారనే గ్రంధకర్తలు పేర్కొన్నారు. మహా వీరుడు అయిన పాపన్న కల్లు గీత నీచమని భావించి గొప్ప మన్నే కాడు  (రాజు) కావాలని వీరవిద్యలు నేర్చాడు. సైన్యాన్ని తయారుచేసి 1708 సం!! మొహరం నాడు ఓరుగల్లు కోటను ముట్టడించి ఎడుఘడియలు సింహాసనం ఎక్కాడు. ఇలాంటి మహావీరులున్న జాతి ఈ సెట్టిబలిజ. 

చరిత్ర పుటలు తిరగవేస్తే, సంస్థానాలకై పీయతులు తరచి చూస్తే, శాసనాలు పరిశోధిస్తే ఇంకా మన జాతికి చెందిన ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయి.  స్వర్గీయ శ్రీ పల వెంకన్నగారు సెట్టిబలిజ పత్రిక సంపాదకులు. ఎంతో పరిశోధన చేసి శ్రీ తురగా వెంకటరామయ్య  అనే మిత్రుని సహాయంతో " కులభ్యుదయ చరిత్ర "  వ్రాసారు. వారి కృషి, పరిశోదన చిరస్మరనీయము. 

19వ శతాబ్దికి పూర్వం ఈ సెట్టిబిజ జాతి- ఈడిగిల బడిన ఈదిగాజాతి గానే చూడబడినది. పెతందారులు ఈజాతిని తొత్తులుగా చేసుకొని కించ పరచారు. ఇతిహాసాలు ఏమి చెబుతున్నాయి? విద్యావంతులను, అమృతం త్రాగే దేవతలుగా ఆకాశానికి ఎత్తారు. విద్యాహీనులను, బండచాకిరీ చేసే వారిని కల్లు తాగే రాక్షసులుగా ముద్రవేసారు. 

" బలవంతులు దుర్భాలజాతిని 
  బలహీనులు గావించారు "        -- శ్రీ శ్రీ

అందుకీ మన జాతి పిత  శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు విద్యాభివృద్ది లక్ష్యంగా పదివేల రూపాయలతో విద్యనిధిని ఏర్పాటు చేసారు. పీరూరులో డి.యెన్.శెట్టి,  డి.వి.రెడ్డి హై స్కూల్ (దొమ్మేటి నర్సయ్య శెట్టి, దొమ్మేటి వెంకట రెడ్డి  హై స్కూల్)  స్థాపించారు. దొమ్మేటి నర్సయ్య శెట్టి గారు కాట్రేనికోన శివారు వెట్లపాలెం గ్రామంలో 49 ఎకరాల పల్లపు భూమిని హై స్కూల్ నకు విరలముగా వ్రాసి ఇచ్చినారు. బర్మా లోను, ఇతర ప్రదేసలలోను జాతి సోదరులను సమావేశ పరచి విద్యనిధీ ఆవశ్యకతను వివరించి 1940 సం  నాటికీ ఈ నిదిని యాబయి  వేలకు పెంచారు. ఈ విద్యానిధి కల్పతరువై ఎందరో సెట్టిబలిజ విద్యార్ధులను ఆదుకొని విద్యావంతులను చేసింది. 

" సంఘీభవించి ఎంతటి కర్యమైనను సాదింప వచ్చును " అనే సూక్తి కి ఈ సెట్టిబలిజ సంఘ స్థాపన చక్కని నిదర్శనం. 

ఆనాడు;
=====

కల్లు గీసుకొని బ్రతికే అనాగరికమైన జాతి గా ముద్రవేయబడి అజ్నననరకకూపములో దిగబడి పోయిన  జాతి-  విద్యాగంధము లేక, విజ్ఞానమనేమాట తెలీక చీకటి లో మ్రగ్గి పోయిన జాతి- వెంకమ్మ, వెంకిగా పుల్లమ్మ, పుల్లిగా, వెంకయ్య వెంకడుగా పిలువబడుతూ హీనాతిహీనముగా చూడబడిన జాతి- చెప్పులు తోడుక్కోవడం తప్పుగా, పంచి కట్టడం పాపంగా భావించబడిన జాతి- పల్లకీలు మోయడం తప్ప పల్లికీలు ఎక్కడానికి పనికిరాని జాతి- రాజులై రాజ్యాలు ఎలదనికిగాని, మంత్రులై రాజకీయతంత్రాలు నడపడానికిగాని పనికిరానిజాతి- 
సైన్యాధి పతులై పౌరుషపరాక్రమాలు ప్రదర్శించడానికి అవకాశంలేక అట్టడుగునపడి అనగారిపోయిన జాతి. 

ఈనాడు:
=====

శాసన సభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, డి. జి.ఐ. లుగా, మండలధ్యక్షులుగా, గ్రామసర్పంచ్ లుగా, డాక్టర్లుగా, లాయర్లు గా, ఉన్నతోద్యోగులుగా గౌరవమర్యాదలు పొందుతూ  "నీవెవరు?" అని అడిగితే "నేను సెట్టిబలిజ" అని సగర్వంగా చాటిచేప్పుకొనే స్థాయికి మన జాతి ఎదిగింది. ఇదంతా సంఘభలం- విధ్యభలం- మన పితమహులైన సంఘ్ వ్యవస్థాపకుల త్యాగఫలం. 

" విద్యవంతము కాని జాతి ఎన్నటికీ అభివృద్దిని గాంచలేదు "  --డా!! బి. ఆర్. అంబేద్కర్ 

మనపెద్దల చల్లని ఆశీస్సులతో, బ్రిసిష్ ప్రభుత్వం వారి ఆదరణతో సంఘనాయకుల పట్టుదలతో, దృడ దీక్షతో "ఇంతింతై వటుడింతై" అన్నట్లు ఎదుగుతున్నది ఈ జాతి. ఈ అభివృద్దిని ఎవరూ ఆపలేరు. 

మన కర్తవ్యం:
==========

మనజాతికి కొండంత అండగా నిలబడిన మన సంఘాన్ని సఖోపసాఖలుగా విస్తరింపజేయాలి, సంఘ్ విద్యనిధిని లక్షల మేరకు హేచ్చించాలి, ప్రతి తాలుకాలో సెట్టిబలిజ సంఘ్ భవనాలు నిర్మాణం కావాలి, పల్లె పల్లె కూ మూల మూలకు సంఘ్ కార్యకలాపాలు విస్తరించాలి. పేద వారైనా బాలబాలికలను విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి మనచేయూత నందించాలి. సెట్టిబలిజల కీర్తి దేసదేసాల్లో విరాజిల్లాలి. అప్పుడే మన జాతి నాయకులైన శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి, శ్రీ గుత్తుల సూర్యనారాయణ, శ్రీ కుడుపూడి సూర్యనారాయణ, శ్రీ గూడూరి శ్రీరాములు, శ్రీ మేడిశెట్టి సూర్యనారాయణ గారలవంటి ఎందరో మహానుభావుల కళలు సర్ధకములౌతాయి. అప్పుడే మన సంఘానికి నిజమైన స్వర్ణోత్సవం.
జై సెట్టిబలిజ. 


        

1 comment:

  1. అయ్యా నమస్కారం.

    నా పేరు తురగా కృష్ణకుమార్.

    కులాభ్యుదయ చరిత్ర వ్రాసిన తురగా వేంకటరామయ్యగారు మా తాతగారు.

    ఆ పుస్తకం ఏమైనా దొరుకుతుందాండి??

    ReplyDelete